విద్యార్థిని విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మైలవరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం శైలజ పిలుపునిచ్చారు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె బాల్యవివాహాలు లైంగిక వేధింపులు పోక్సో కేసులు తదితర అంశాల గురించి వివరించారు.