పట్టణ ప్రజలకు నాసిరకం మాంసం విక్రయించడంతోపాటు పరిశుభ్రత ప్రమాణాలు పాటించని మదీనా కాలనీలోని గణేష్ మటన్ షాప్ ను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ మాంసం విక్రయించే యజమానులు పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని లేనిచో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.