అనారోగ్యంతో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడని ఆచూకి తెలిస్తే చెప్పాలని పీలేరు అర్బన్ ఎస్ఐ లోకేష్ ఆదివారం సాయంత్రం 6గంటలకు తెలిపారు. పీలేరు మండలం పీలేరు పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద ఈనెల 19వ తేదీ రైల్వే స్టేషన్ సమీపం వద్ద అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉండగా 108 అంబులెన్స్ ద్వారా పీలేరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.అయితే మృతి చెందిన వ్యక్తి బ్రతికి ఉన్న సమయంలో తన పేరు హనుమంతు,ఉరవకొండ అని చెప్పాడని తెలిపారు.మృతుడి ఆచూకీ తెలిస్తే,పీలేరు అర్బన్ సి.ఐ నంబర్ 9440796744,ఎస్సై నెంబర్ 9440796745 కు సమాచారం ఇవ్వాలని కోరారు