జనగామ జిల్లాలో భూ భారతి సదస్సులలో దరఖాస్తు చేసుకున్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం MRO కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ సాగులో ఉన్న భూములన్నిటికి ఫీల్డ్ సర్వే నిర్వహించి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అన్నారు.