సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని బాన్సువాడ సహకార సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం 11 గంటల నుండి రెండు గంటల వరకు బాన్సువాడ సహకార సంఘం మహాజన సభను అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం ఎరువులు ఇతర వ్యాపారాల ద్వారా ఈ ఏడాది సంఘం ఆర్థికంగా లావదేకంగా ఉందని అధ్యక్షులు వెల్లడించారు. పాలకవర్గము రైతుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తానని వెల్లడించారు.