భారీ వర్షంతో మామిడికుదురులో 216వ నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురైంది. రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతీ ఏటా వర్షం కురిసినప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. వర్షం తగ్గిన మూడు రోజుల వరకూ నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అధికారులు సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.