ట్రాఫిక్ పోలీస్ నెంబర్ కేటాయింపు ప్రక్రియ 2025 ఫిబ్రవరి నెలలో ప్రారంభించడం జరిగిందని, ఫిబ్రవరి 2025 నుండి జూలై 2025 వరకు మొత్తం 10,600 ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు జారీ చేయడం జరిగిందని, అయితే ఇప్పటికీ సుమారు 5,000 ఆటోలు ట్రాఫిక్ పోలీస్ నెంబరు పొందకుండా నడుస్తున్నాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నగర తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ నెంబర్ అమలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను పెంపొందించడంతో పాటు అనధికార ఆటో డ్రైవర్లను క్రమబద్ధీకరణ చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.