పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం చముడుగూడలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గత నెల 29 న జరిగిన కంది కొత్తల ఉత్సవాలలో సాంబార్ టబ్ లో రమేష్ అనే గిరిజన యువకుడు జారిపడ్డాడు. 3 రోజుల పాటు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని భార్య నిండు గర్భిణీ అవ్వడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నూతన సంవత్సరంతో చముడుగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.