Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజెర్ల మండలం, నాగులవెల్లటూరు B.S.R.N జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా బయాలజి సైన్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. HM, MEO, DEOలకు పలు మార్లు వినతులు చేసినా చర్యలు లేకపోవడంతో తల్లిదండ్రులు, SMC సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 25న పాఠశాలను మూసివేసి ధర్నా నిర్వహించనున్నట్లు HMకు వినతిపత్రం అందజేశారు.