కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కుళ్లిపోయింది కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు అని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. BRS పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో స్థానిక నాయకత్వం తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.