మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకులగూడెం గ్రామపంచాయతీలో ఆదివాసి సాంప్రదాయా పద్దతులలో సారాలమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధల నడుమ గ్రామ పెద్దలు, ఆదివాసి పూజారులు అమ్మవారిని గద్దెల పైకి తీసుకువచ్చారు, గద్దలపైకి చేరుకున్న అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకుని,బంగారం మొక్కలు చెల్లించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తిస్థాయిగా ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ వేడుకలకు ఆదివాసీలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.