ఏటూరునాగారంలోని ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైందని SFI జిల్లా అధ్యక్షుడు రవితేజ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం హాస్టల్ సందర్శించి, విద్యార్థులతో మాట్లాడినట్లు తెలిపారు. రవితేజ మాట్లాడుతూ.. హాస్టల్లో వార్డెన్, వర్కర్లు సైతం లేరని మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు.