పెద్ద కడుబూరు: మండలంలోని కల్లుకుంట గ్రామ రైతులపై కేసులు నమోదు చేయడంపై సీపీఐ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఆర్ ఓఆర్ కేసుల భూముల విషయంలో తహశీల్దార్, ఎస్సై చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ , పెద్ద కడబూరు మండల కార్యదర్శి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.