దసరా పండుగను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా అంటూ ఎటు చూసినా ప్రయాణికులతో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నిండిపోయింది. మరో రెండు రోజులలో దసరా పండుగ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్కు వేల సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నారు.