తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని దేవుని కండ్రిగ గ్రామ ఎస్ టి కాలనీలో గురువారం నాయుడుపేట కోర్టు జడ్జి మీనాక్షి సుందరి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు వాటి పరిణామాలు అనే అంశంపై ఎస్టీ కాలనీ వాసులకు జడ్జి మీనాక్షి సుందరి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయడం చట్టనిత్యా నేరమని ఆ చట్టం గురించి కాలనీవాసులకు క్షుణ్ణంగా వివరించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వారందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.