సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం ఏర్పడింది. దాంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.