దసరా సందర్భంగా హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు హెచ్చరించారు. నెల్లూరు మినీ బైపాస్ లోని ఓ డాబాలో ఈనెల 15వ తేదీ కొందరు హిజ్రాలు దసరా మామూళ్ల కోసం బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో ధాబా నిర్వాహకులు బాలాజీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు