సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, వాటిని ఎదుర్కొని జీవించాలని, ప్రాణం విలువ ఎంతో విలువైందని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు అన్నారు. బుధవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న విషయాలకే యువత ఆత్మహత్యలు చేసుకొని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలిస్తున్నారని అన్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే టెలి మానస్ 14416తో కౌన్సిలింగ్ తీసుకోవాలన్నారు, చాలామంది మత్తు పదార్థాలకు మద్యానికి బానిసలై చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జీవితం చాలా గొప్పదని అన్నారు.