కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం తెలంగాణ ప్రజలపై వేసిన కేసని పేర్కొన్నారు. గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.