సరుబుజ్జిలిలో అలికాం-బత్తిలి రహదారికి రూ.12 కోట్లతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ ఎస్. సూర్యంతో కలిసి పూజలు చేశారు.