కర్నూలు నగర అభివృద్ధి పనుల్లో ఏమాత్రం జాప్యం తగదని, ప్రజలకు ప్రత్యక్షంగా కనబడేలా ప్రగతి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలసి మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా గత సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపై విపులంగా చర్చించారు. బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు విస్తరణ, కిడ్స్ వరల్డ్ కూడలి నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.