మద్యం షాపుల దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించిందని ఆళ్లగడ్డ ఎక్సైజ్ సీఐ కృష్ణముర్తి తెలిపారు. మొదటిగా ప్రకటించిన గడువు ముగిసిందని, ఔత్సాహికుల వినతుల మేరకు ప్రభుత్వం పొడిగించిందని అన్నారు. 12న దరఖాస్తుల పరిశీలించి, 14న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తామన్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు.