పాణ్యం మండలం కొత్తూరులో వెలసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాస ఆదివారం పూజలు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ అర్చకులు నారాయణ స్వామి, సురేశ్ శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళ హారతి నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.