యూరియా లేక తెలంగాణ రైతులు హరిగోస పడుతుంటే BJP, BRS పార్టీలు నీచ రాజకీయాలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాయని ఏటూరునాగారం కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాలు BRS అధికారంలో ఉన్నప్పుడు కూడా యూరియా కొరత ఉందని, చెప్పులు క్యూ లైన్లలో పెట్టిన రోజులు సైతం ఉన్నాయన్నారు. కాగా, వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు రూ. 5.40 కోట్లు దసరాకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.