టెక్కలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకలు ఆసుపత్రిని మంజూరు చేసినందుకు గురువారం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుల చిత్రపటాలకు టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగింది. ఎలాంటి అభివృద్ధి చెయ్యాలన్న తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని కొనియాడారు.