భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం గాంధీనగర్(భూపాలపల్లి) మహాత్మా జ్యోతిభాపూలే పాఠశాల(బాలికలు)ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే విద్యార్థుల తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాంపౌండ్ గోడ, సీసీ కెమెరాలు, గ్రౌండ్ లెవలింగ్, బెంచీలు, డైనింగ్ హాల్ తదితర సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు.