కళ్యాణదుర్గంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలోని ఐదు మండలాలకు చెందిన కన్వీనర్లు సూర్యనారాయణ, సుధీర్ బాబు, కే హనుమంతరాయుడు, గొల్ల హనుమంత రాయుడు, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈనెల 9న అన్నదాత పోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న నేపథ్యంలో పార్టీ పిలుపుమేరకు అన్నదాత బోరు కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. జయప్రదం చేయాలని కోరారు.