అరుణ వాడిన తుపాకీ ఎవరిది..? పోలీసుల దర్యాప్తు ఎంత వరకు వచ్చింది గన్ తో బెదిరించి సెటిల్మెంట్ కి పాల్పడిందని లేడిడాన్ అరుణ పై నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. అయితే అరుణ వాడిన గన్ ఎవరిది..? అస్సలు నిజంగానే వర్జినల్ గన్ హా లేక డమ్మీ గన్ హా అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఓ ఎస్ ఐ తో అరుణ సన్నిహితంగా ఉండేది. దీంతో ఆయన సర్వీస్ గన్ ఏమైనా వాడిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరుణ ను మరోసారి కష్టడికి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.