ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శనివారం ప్రాణపాయం తప్పింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ సమీపంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. అటువైపు నుంచి వెళ్తున్నా ఓ భక్తుడు ఆ పరిసర ప్రాంతాలను మొబైల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తుండగా కొండచరియలు విరిగి పడుతున్న దృశ్యాలు మొబైల్ ఫోన్ కు చిక్కాయ్. కొండచరియలు విరిగి పడుతున్న సమయంలో భక్తులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తతో వ్యవహరిస్తూ దర్శనాలు నిలిపివేశారు.