ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో నాటు బాంబు కలకలం రేగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కుక్క నాటు బాంబును నోటితో పట్టుకొని తిరుగుతుండగా ఒకసారిగా పెద్ద శబ్దంతో నాటుబంబు పేలింది. దీంతో కుక్కతల చిద్రమై చనిపోయింది. కాలనీలో నాటు బాంబు పేలడంతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి నాటుబాంబు ఎక్కడి నుంచి వచ్చిందో అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు.