వసుధ ఫౌండేషన్ మానవతా సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. ఆదివారం గరగపర్రు గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలకు సాయంకాలం 6 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లాల 21 సేవా సంస్థలకు రూ.28 లక్షలు, 11 మంది రోగులకు రూ.2.50 లక్షలు, 30 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రూ.2.10 లక్షలు ఉపకార వేతనంగా అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. చైర్మన్ మంతెన వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.