వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడిపల్లి గ్రామాన్ని చెందిన ఇందిరమ్మ లబ్దారులకు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుఅర్ద సుధాకర్ రెడ్డి ఆదివారం ఇందిరమ్మ గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం అందించడం జరుగుతుందని ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి అందజేస్తున్నట్లు తెలిపారు.