కె.వి.పల్లి మండలం ఇర్రి వాండ్లపల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇర్రివాండ్లపల్లి గ్రామంలో పేడ దిబ్బ గురించి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజ నాయుడు వేసుకున్న దిబ్బను జగన్మోహన్ నాయుడు జెసిపి సహాయంతో తొలగించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదంతో మొదలై ఘర్షణతో ఇరువర్గాల మధ్య దాడులకు దారి తీసింది. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన చప్పిడి నాగరాజా నాయుడు ను కుటుంబ సభ్యులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోకుల జగన్మోహన్ నాయుడు కి స్వల్ప గాయాలయ్యాయి.