పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 14 క్రస్ట్ గేట్లను ఎత్తి అధికారులు నీరును కిందికి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పైనుంచి వరద ఎక్కువగా వస్తున్న క్రమంలో ముందుగా ఉదయం 9 క్రస్ట్ గేట్ల ద్వారా ఐదు మీటర్ల ఎత్తి నీటిని విడుదల చేశామని అనంతరం మరో ఐదు గేట్ల ద్వారా నీటీ నీ కిందకి విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ వరద ఉధృతి ఎక్కువగా ఉంటే గేట్లు మొత్తం కూడా ఎత్తే పరిస్థితి నెలకొందని అధికారులు తెలియజేశారు.