నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన పాణ్యం సిమెంట్ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం బండారు సుబ్బారావు మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సంతాపం తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి సుబ్బారావు మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలోని విద్యార్థులు సంతాపం తెలిపారు.