కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పుట్టపర్తిలోని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం ఉదయం చిత్రావతి నది నుంచి వస్తున్న నీరు కాలువ ద్వారా ఎనుములపల్లి చెరువులో కలుస్తున్నాయి. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలువ ఇలాగే ప్రవహిస్తే మూడు రోజుల్లో చెరువు మరువ పారడం కాయమని, చెరువు కట్ట కింద పండిస్తున్న పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కమనీయ దృశ్యాన్ని చూడడానికి గ్రామంలోని ప్రజలు కాలువద్దకు తరలివస్తున్నారు.