పత్తికొండలో తుఫాన్ ప్రభావంతో ప్రారంభమైన వర్షం బుధవారం ఉదయం కూడా తేలికపాటి గా కురుస్తూనే ఉంది. వర్షంతో రైతులు, కూలీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఆటోలలో ప్రయాణించాల్సి వస్తోంది.వర్షంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం పడుతోంది.