యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాదులో కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వలిగొండ మండలం సంగెం వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. శనివారం తెలిసిన వివరాల ప్రకారం దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బ్రిడ్జిల వద్ద భారీ కేట్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.