డి.హిరేహాల్ మండలం తమ్మేపల్లి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లు తగిలి ఎలుగుబంటి మృతి చెందింది. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఫారెస్టు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి, ఫారెస్టు సిబ్బందితో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె వద్ద తేనెపట్టు కోసం వెళ్లి విద్యుత్ షాక్ కు గురై మృతిచెందినట్లు నిర్థారించారు. పశు వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.