తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు విద్యార్థి ఎం.వెంకట కార్తీక్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 29వ తేదీ నుంచి 31 తేదీ వరకు ప్రకాశం జిల్లా చేవూరులో నిర్వహించనున్న బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని HM పార్వతమ్మ తెలిపారు. వెంకట కార్తీక్ ను టీచర్లు శుక్రవారం అభినందించారు. భవిష్యత్తు లో మరెన్నో విజయాలు అందుకోవాలన్నారు