జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యములో గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరి శ్రీమతి అలుగు వర్షిణి అధ్యక్షతన జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లాలోని వివిధ సంబంధిత శాఖల అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో, మండలాల వారిగా విద్యా, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజ్ , మొదలైన అంశాల...