ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలని,వివిధ పార్టీ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కోరారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం జరిగిందని దానిపై అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం జరిగిందని,జిల్లాలోని వార్డులలో గ్రామపంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు.ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29,30 తేదీలలో అందచేయాలన్నారు.