తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. గుంతకల్ ఆర్డీవో కార్యాలయం వద్ద పెన్షన్లను పునరుద్ధరించాలని వైసీపీ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడారు. గుంతకల్ నియోజకవర్గంలో 1661 పెన్షన్లను తొలగించారన్నారు. వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.