శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లిలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీల్లో గాయపడిన హేమంత్(20) శనివారం ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు 15 రోజులపాటు బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడన్నారు. యుక్త వయస్సులోనే మరణించడంతో జానకంపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.