ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సోమవారం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిషన్ బాబు పర్యటన వివరాలను తెలియజేశారు. ఎర్రగొండపాలెం ఎస్బిఐ బజార్ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ సోమవారం ఉదయం 8 గంటలకు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్ అండ్ బి బంగ్లా నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.