తిరుపతి జిల్లా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఆధారితతో ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆర్.ఐ ప్రదీప్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ జనార్దన్ రావు చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ..మండలానికి 15,492 కార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్డులను సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్సి నద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.