ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అధికారుల వద్దకు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రి జిల్లా బిజెపి కార్యాలయంలో వారధి కార్యక్రమం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ వారిది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.