మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం సంగీతాండ గ్రామ శివారులోనీ కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం మేకల కాపాడి అటుగా వెళుతుండగా మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతుడు ఒంగోలుకు చెందిన గాలయ్యగా 30 గా గుర్తించారు. గాలయ్య భార్య సొంతూరు వెంకటాపూర్ గ్రామమని సమాచారం.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.