కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పూడ్చిపెట్టే ఖర్చు మరియు ఇతర ప్రయోజనాల కోసం ఎకరానికి రూ.5,000/- అందజేయడంతో పాటు కెజి కాఫీ కి రూ.50/- నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు.మంత్రి శనివారం అల్లూరి జిల్లా అరకు వ్యాలీ మండలం చినలబుడు, పకనకుడి గ్రామాల్లో పర్యటించి కాఫీ బెర్రీ బోరర్ తోటలను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ తో కలసి సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు