నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామివార్లకు ఘనంగా పల్లకి ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవాన్ని చేపట్టారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈవో పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.